ఇండ్లు ఆడుకునే బొమ్మల్లా కొట్టుకుపోయినయ్..జమ్మూ కాశ్మీర్ బాధితులు

ఇండ్లు ఆడుకునే బొమ్మల్లా కొట్టుకుపోయినయ్..జమ్మూ కాశ్మీర్ బాధితులు

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని చోసిటీ ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ తో సంభవించిన వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 60 కి చేరింది. మూడో రోజు అయిన శనివారం (ఆగస్టు 16) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మృతుల్లో 21 మృతదేహాలను గుర్తించారు.ఇద్దరు CISF సిబ్బంది మృతదేహాలున్నాయి. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా 73 మంది గల్లంతయిన వారి ఆచూకీ దొరకలేదని అధికారులు వెల్లడించారు. 

ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. 

మరోవైపు కిష్త్వార్ లో భారీ వరదలనుంచి బయటపడిన బాధితులు క్లౌడ్ బరస్ట్ బీభత్సాన్ని గుర్తు చేసుకున్నారు.  ఆకస్మాత్తుగా బాంబు పేలినట్లుగా శబ్ధం వచ్చింది. పరుగెత్తండి,పరుగెత్తండి అంటూ అరుపులు వినిపించాయి.  ఇండ్లు పేకమేడల్లా కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నేను పరుగెత్తుతుండగా శిధిలాలు నాపై దూసుకురావడంతో చిక్కుకుపోయారు. విద్యుత్ స్థంభం నాపై పడింది. నా కూతురుకి ఫోన్ చేశారు. ఆమె నన్ను అక్కడినుంచి బయటికి లాగింది ప్రత్యక్ష సాక్షి, బాధితులు తెలిపింది. 

‘‘చాలా మంది చనిపోయారు ..చాలా మంది గాయపడ్డారు..నేనే నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయాను.. ఒక పోలీసు నాకు సహాయం చేసి నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. నా సోదరి ప్రస్తుతం కనిపించడం లేదు అని మరో బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యారు. 

►ALSO READ | ఇదేం విడ్డూరం.. ఓడిపోయిన యుద్ధానికి 488 మెడల్స్ పంచిన పాకిస్థాన్..!!

కిష్త్వారాలో క్లౌడ్ బరస్ట్ సంభవించినప్పుడు అక్కడే ఉన్న బాధితుడు మాట్లాడుతూ.. ‘‘మేం ఎగిరిపోయి కారు కింద చిక్కుకున్నాను..నా తల్లి విద్యుత్ స్తంభం కింద పడింది. సైన్యం,CRPF జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని మమ్మల్ని రక్షించారు అని అన్నారు.

ఇక కిష్త్వార్ జిల్లా ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ యుధ్వీర్ సింగ్ కొత్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 88 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నాం..36 మందిని జమ్మూలోని జిఎంసికి రిఫర్ చేశాం. ఆసుపత్రికి తీసుకువచ్చిన రెండు మృతదేహాల గుర్తించాల్సి ఉందని తెలిపారు.