
న్యూఢిల్లీ: ఇటీవల వరదలకు అతలాకుతలం అయిన వయనాడ్ జిల్లాలో.. టూరిజానికి మళ్లీ జీవం పోయాలని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు. జిల్లాలో టూరిజాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రియాంకా గాంధీతో పాటు కేరళ కాంగ్రెస్ నేతలతో రాహుల్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇటీవల వర్షాలకు , కొండచరియలు విరిగిపడటంతో జిల్లాలోని కొంత ప్రాంతం దెబ్బతిన్నదని, దానిని పునరుద్ధరించి వయనాడ్ బ్రాండ్‌ను నిలబెట్టాలని సూచించారు.