గూగుల్ సరే.. నీ తెలివి ఏమైందీ : మ్యాప్ చూసి నేరుగా ఏట్లోకి వెళ్లిన కారు

గూగుల్ సరే.. నీ తెలివి ఏమైందీ : మ్యాప్ చూసి నేరుగా ఏట్లోకి వెళ్లిన కారు

కొత్త చోట్లకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్‌ను వాడటం అందరికీ అలవాటే.  అయితే అన్ని సార్లు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గుడ్డిగా పోలేమని ఇలాంటి ఘటనలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాజాగా  హైదరాబాద్‌కు చెందిన ఓ నలుగురు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని పోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.  వారంతా కేరళలోని అలప్పుళకు టూర్‌ వెళ్లారు. ఆ సమయానికి భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. 

రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్‌పై నమ్మకంతో వారు ముందుకే వెళ్లారు. ఈ క్రమంలో వరద నీటి నుంచి కాల్వలోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ అందరూ బయటపడ్డారు కానీ కారు నీట మునిగింది.  ప్రస్తుతం కారును వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పర్యాటకులకు ఈ ప్రాంతం గురించి తెలియని కారణంగా వారు గూగుల్​ మ్యాప్​ను ఉపయోగించి నావిగేట్​ చేస్తూనే నీటి ప్రవాహంలోకి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. 

గతేడాది గూగుల్ మ్యాప్ ను నమ్మకుని నదిలోకి దూసుకెళ్లి ఇద్దరు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.  ఈ సంఘటన తర్వాత కేరళ పోలీసులు వర్షాకాలంలో టెక్నాలజీని ఉపయోగించడంపై మార్గదర్శకాలను జారీ చేశారు.