కాంగ్రెస్ పార్టీలో సర్వే అధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరికి సర్వేనే ప్రామాణికమని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీఎం సిద్దారామయ్య అడిగిన టికెట్ కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్ ఇచ్చారని రేవంత్ తెలిపారు. కొత్తగా పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు
మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి పార్టీలో చేరికపై రేవంత్ స్పందించారు. ప్రతిపాదన వచ్చినప్పుడు దానిపై చర్చ చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో పొత్తు లపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పిన రేవంత్ .. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 80 సీట్లు గెలిచి అధికారం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.
