- తుమ్మిడిహెట్టి విషయంలో ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరు: వినోద్‌కుమార్
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అడ్డుపడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లెటర్ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అంటున్నారని పేర్కొన్నారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరని రేవంత్‌కు తెలుసన్నారు. రేవంత్‌రెడ్డికి చివరకు మేడిగడ్డే దిక్కని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆప్షన్ అని చెప్పారు. మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్ వేచి చూశారని కానీ, ఇప్పుడు దానికే ఆయన రిపేర్లు చేస్తున్నారని ఎద్దేవాచేశారు.
