పెన్షన్‌‌‌‌‌‌‌‌ బకాయిలు అందని వాళ్ల వివరాలివ్వండి...ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

పెన్షన్‌‌‌‌‌‌‌‌ బకాయిలు అందని వాళ్ల వివరాలివ్వండి...ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రిటైర్మెంట్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు ఇంకెంత మందవికి ఇవ్వాలో చెప్పాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లు, సెకండరీ గ్రేడ్‌‌‌‌‌‌‌‌ టీచర్లు, స్కూల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ, ఏఎస్‌‌‌‌‌‌‌‌ఐ వంటి పదవుల్లో రిటైర్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ ప్రయోజనాలు అందకపోవడంతో 764 మందికిపైగా ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. 

గతంలో 3,650 టోకెన్లు జారీ అయ్యాయని,  1,056 టోకెన్లకు చెల్లింపులు జరిగాయని, మరో 2,600 టోకెన్లను త్వరలో చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుల కోసం 50 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని జస్టిస్‌‌‌‌‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారించారు.