మహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లు.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్లు

మహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లు..    ఎండోస్కోపీ ద్వారా తొలగించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్లు

పద్మారావు నగర్, వెలుగు: ఓ మహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డాక్టర్లు తొలగించారు. నల్గొండ జిల్లాకు చెందిన మహిళ బుధవారం చేపల కూరతో అన్నం తింటుండగా.. చేప ముల్లు ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ఉమ ఆధ్వర్యంలో డార్టర్లు ఎండోస్కోపీ విధానంలో ముల్లును బయటకు తీశారు. బాధిత కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.