పద్మారావునగర్, వెలుగు: చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ(వడ్రంగి) నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున సికింద్రాబాద్‌కు చెందిన యువకుడు పాల్గొననున్నాడు. పార్శీగుట్ట బాపూజీనగర్‌కు చెందిన కేసోజు బ్రహ్మాచారి, మాధవి దంపతుల కొడుకు యశ్వంత్ చారి కేశవ్ మెమోరియల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ చదువుతున్నాడు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో వడ్రంగి వృత్తిలో ప్రతిభ చాటి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతిని అందుకున్నాడు. ఈ ప్రదర్శన వల్ల చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ నైపుణ్య పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు యశ్వంత్‌ను అభినందించారు.
