అగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మోడీ నిర్ణయం దేశభద్రతకే ముప్పు అని  రేవంత్ రెడ్డి అన్నారు. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందితులను ఆయన పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్ అయిన రేవంత్.. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, అనిల్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి నిందితులను కలిశారు. సికింద్రాబాద్ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సహాయం అందిస్తామని వారికి రేవంత్ హామీ ఇచ్చారు. న్యాయ సహాయం అందించేందుకు ఇప్పటికే గాంధీభవన్ లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారని రేవంత్ చెప్పారు. అగ్నిపథ్ పై ప్రధాని హడావిడి నిర్ణయం తీసుకున్నారని.. ఏకపక్ష నిర్ణయంతో యువకుల్లో అయోమయం నెలకొందని విమర్శించారు. కేవలం 4ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అంటే ఎట్లా అన్న ఆయన..అగ్నిపథ్ 6 నెలల ట్రైనింగ్ లో ఏం నేర్పిస్తారని ప్రశ్నించారు. రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి భద్రత లేకుండా కుట్ర చేశారని ఆరోపించారు.  మూడేళ్ల నుంచి ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని..దీంతో సైనికుల కొరత ఏర్పడిందన్నారు.  2020లో ఫిజికల్ ఎగ్జామ్స్ పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు.