50 వేల కోట్ల దోపిడీకి కేసీఆర్ స్కెచ్

50 వేల కోట్ల దోపిడీకి కేసీఆర్ స్కెచ్
  • సింగరేణి బొగ్గు గనులను అదానీకి అప్పగించిన్రు: రేవంత్ రెడ్డి
  • ఒడిశా మైన్స్‌‌లో కేసీఆర్ బినామీల పెట్టుబడి
  • రూల్స్‌‌కు విరుద్ధంగా టెండర్లు.. సహకరించిన సింగరేణి సీఎండీ
  • మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ నిర్వహించాల్సిన బొగ్గు గనులను అదానీకి అప్పజెప్పి.. సీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్ల దోపిడీకి తెర తీశారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాణ్యమైన బొగ్గు ఉండే ఒడిశాలోని నైనీ గనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర చేశాయన్నారు. టెండర్ల విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. సోమవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత లాభదాయకంగా నడుస్తున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దానికి రాష్ట్రం వంత పాడుతున్నదని మండిపడ్డారు. సింగరేణి కంపెనీలో రాష్ట్రం వాటా 50 శాతం అయితే, కేంద్రం వాటా 49 శాతమని తెలిపారు. 

కేసీఆర్ సన్నిహితులకు వాటాలు

‘‘ఒడిశాలోని నైనీ బొగ్గు గనుల్లో తక్కువ బూడిద, తక్కువ మట్టి నుంచి ఎక్కువ బొగ్గు వచ్చే నాణ్యమైన నిల్వలు ఉన్నాయి. వాటితో సింగరేణికి ఎంతో లాభం వస్తుంది. అలాంటి గనులను ప్రైవేటైజ్ చేయడం వెనుక కుట్ర ఉంది. ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం టైలర్ మేడ్ టెండర్ల ప్రక్రియ రూపొందించారు. దాంతో కాంట్రాక్టు అదానీకి దక్కింది. ఈ టెండర్ జారీ ప్రక్రియలో ఎక్కడా లేనివిధంగా బయట నుంచి పెట్టుబడులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్నిహితుడైన వ్యక్తికి (ప్రతిమ శ్రీనివాస్​) 50% వాటా లభించింది. దీన్ని బట్టి కేసీఆర్ బినామీలే ఈ కాంట్రాక్టు దక్కించుకున్నారని అర్థమవుతోంది’’ అని రేవంత్ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేక కూటమి ఒక డ్రామా అన్నారు. 

ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలే

నైనీ గనులకు సంబంధించి తాము కేంద్ర మంత్రి, కోల్ ఇండియా అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని రేవంత్​ చెప్పారు. ‘‘టెండర్లకు ముందే నేను, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి అందర్నీ అలర్ట్ చేసినం. కానీ జరగాల్సిన పని జరిగిపోయింది. కేసీఆర్ మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా తామేమీ చేయలేమని, పీఎంవో మాత్రమే ఇలాంటి విషయాలపై స్పందిస్తుందని వాళ్లు చేతులెత్తేశారు. కేసీఆర్ అవినీతి గురించి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నా.. ఏమీ చేయడం లేదంటేనే వారి మధ్య ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది’’ అని ఆరోపించారు. గనుల ప్రైవేటైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్ని విధాలా సహకరిస్తున్నారని చెప్పారు. నైనీ టెండర్లపై, కేసీఆర్​ అవినీతి, సింగరేణి సీఎండీపై విచారణ జరపాలన్నారు. కాగా, జగ్గారెడ్డి ఎదుర్కొంటున్న సమస్య తన దృష్టికి వచ్చిందని, పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారని, తాము అండగా  ఉంటామని చెప్పారు.