రెండు వారాల్లో ఇన్ని అఘాయిత్యాలా ? 

రెండు వారాల్లో ఇన్ని అఘాయిత్యాలా ? 

కేవలం గత రెండు వారాల్లో ఇన్ని అఘాయిత్యాలా ? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన ట్వీట్ చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం, హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రం నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుండడం బాధాకరమన్నారు. సీఎం సొంత పార్టీ, తొత్తు పార్టీనేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలవుతున్నారని ఆరోపించారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దారుణమన్నారు. జరిగిన ఘటనలకు సంబంధించిన క్లిప్పింగ్స్ లను ఆయన ట్వీట్ లో పోస్టు చేశారు. 

కొన్ని రోజులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆడపిల్లలపై దారుణ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జూబ్లిహిల్స్ లోని ఓ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే.. పలు జిల్లాల్లో దారుణ ఘటనలు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.