రాహుల్ తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్

రాహుల్ తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్

హైదరాబాద్: రాహుల్ గాంధీ 2 రోజుల తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను టీపీసీసీ రిలీజ్ చేసింది. దాని ప్రకారం... మే 6వ తేదీ సాయంత్రం 4:50కి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5:10కి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి  10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు.

మరుసటి రోజు అనగా మే 7 మధ్యాహ్నం 12:30 గంటలకి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి  సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. అక్కడ దివంగత కాంగ్రెస నేత, మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు గాంధీ భవన్ లో పార్టీ అంతర్గత కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో రాజకీయాల తీరు, పార్టీ పరిస్థితి తదితర విషయాల గురించి టీపీసీసీ నేతలతో రాహుల్ చర్చించనున్నారు. ఆ సమావేశానంతరం మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం  ఏయిర్పోట్ చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

మరిన్ని వార్తల కోసం...

ఫెడ్ న్యూయార్క్‌‌లో డైరెక్టర్‌‌‌‌గా తెలుగు వ్యక్తి

ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం