ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలె

ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలె

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి కార్యం వెలగబెడుతున్నాడో  చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  వీ6 వెలుగులో ప్రచురితమైన వార్తను రేవంత్ తన ట్వీట్ లో అటాచ్ చేశారు. భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు నష్టపోతుంటే... కేసీఆర్ సర్కారుకు ఏమాత్రం సోయి లేదని మండిపడ్డారు. నష్టాన్ని అంచనా వేయడానికి తక్షణం బృందాలను పంపాలన్నారు. ఎకారకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ క్రమంలోనే రైతులకు పరిహారం అందించాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇవేమీ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి. వర్షాల గురించి రివ్యూ చేస్తున్న సమయంలో సీఎం రాజకీయాల గురించి మాట్లాడటం పట్ల ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలో  ఉన్న సీఎం కేసీఆర్... అక్కడ ఏం చేస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.