కాంగ్రెస్ త్యాగాలు అల్పులకు అర్థం కావు

కాంగ్రెస్ త్యాగాలు అల్పులకు అర్థం కావు

హైదరాబాద్: ఏం చేయడానికి రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు రాహుల్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్’ అని ప్రశ్నించారు. నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలు తనలాంటి అల్పులకు అర్థం కావని హరీష్ ను విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, అర్హత హరీష్ కు లేవని రేవంత్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

త్వరలోనే బీహార్లో పాదయాత్ర చేస్తా

తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం