తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం

తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం

తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. ఓ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. మహిళపై మైసూరు, మండ్య జిల్లా, కేఆర్ పురంలో మిస్సింగ్ కేసు నమోదయిందని అంటున్నారు. మహిళ తల్లిదండ్రులే బాలుడ్ని తీసుకొచ్చి విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారని పోలీసులు తెలిపారు. 

కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాల ఆధారంగా విస్తృత దర్యాప్తు చేశామన్నారు పోలీసులు. పవిత్ర.. గోవర్ధన్ ను వెంట తీసుకున్న దృశ్యాలను సేకరించామన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయని.. బాలుడు కిడ్నాప్ అయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకూ వ్యాపించిందన్నారు. ఇదే సమయంలో.. పవిత్ర తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై.. తిరుమలకు బాబును తీసుకురావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. నాలుగేళ్ల తమ బాబు.. తిరిగి క్షేమంగా తిరుమల చేరడంపై.. బాధిత కుటుంబీకులు ఆనందంతో.. భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని వార్తల కోసం...

ఫెడ్ న్యూయార్క్‌‌లో డైరెక్టర్‌‌‌‌గా తెలుగు వ్యక్తి

ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం