పరిగి, వెలుగు: ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో వినూత్న నిరసన చేపట్టారు. భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ ఆధ్వర్యంలో మహిళా వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
