సీఎం కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి

సీఎం కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి

హైద‌రాబాద్: ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్ళు రావటం అంటే సీఎం కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలన్నారు కాంగ్రెస్ నేత‌లు. గురువారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులు పరిశీలించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు. ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంత‌ర్ ఉత్త‌మ్ మాట్లాడుతూ..ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ పని తీరుకు ఉస్మానియా సంఘ‌ట‌నే నిదర్శనం అన్నారు. చిన్న వానకే హాస్పిటల్ లోకి నీళ్ళు వచ్చాయంటే పాలకులు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ఇది తుగ్లక్ పాలన అనాలా ఇంకా ఏమన్నా అనాలా అన్నారు. ఆయన మూఢ నమ్మకాల కోసం సెక్రటేరియట్ కూలగుడుతున్నడని.. ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తాయని తక్కువ టెస్టులు చేస్తున్నారన్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువ చేసి చూపిస్తున్నారని, హైదరాబాద్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.

ప్రభుత్వ పని తీరుతో ప్రభుత్వ ఆసుపత్రులపైన జనాలకు నమ్మకం పోయిందని.. ప్రైవేట్ హాస్పిటల్ పై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చటం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్ రబ్బర్ స్టాంప్ మంత్రి అని.. కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలె ఇవ్వాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లల్లో ఏమి జరుగుతుందో అందరికీ తెలిసే విధంగా లైవ్ డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా ఉస్మానియా హాస్పిటల్ ను కాపాడుకోవాలన్నారు. కరోనా పేషంట్ లకు చికిత్స చేస్తున్న డాక్టర్స్, నర్సులు , సిబ్బందికి అందరికీ 50 శాతం జీతం ఎక్కువ ఇవ్వాలన్నారు ఉత్త‌మ్.