బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వనస్థలిపురం పీఎస్ లో టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని.. అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకేనని కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం పైన తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read :- వాట్సాప్లో అద్భుతమైన కొత్త ఫీచర్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలసిందే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తుందన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల ఖర్చయితే.. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.1.5 లక్షల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు.