కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు చేసిందేమీ లేదు : వెడ్మ బోజ్జు పటేల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు చేసిందేమీ లేదు : వెడ్మ బోజ్జు పటేల్

ఖానాపూర్/ పెంబి, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను అన్ని రకాలుగా మోసగించాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని కాంగ్రెస్  పార్టీ ఆఫీసులో బాబాపూర్, పెంబి, గోసంపల్లి, బాబాపూర్(ఆర్) గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశం, రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఫైర్​అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను బొంద పెట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే భారీగా ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు దయానంద్, షబ్బీర్ పాషా, పెంబి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, మార్కెట్ మాజీ చైర్మన్ గంగ నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం, మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, ఎంపీటీసీ జంగిలి శంకర్, నాయకులు పాల్గొన్నారు.