ఎం1 ఎక్స్ఛేంజ్లో చాలా తక్కువ వడ్డీ ఉంటుంది

ఎం1 ఎక్స్ఛేంజ్లో చాలా తక్కువ వడ్డీ ఉంటుంది

హైదరాబాద్​, వెలుగు:
మెటీరియల్ అందించిన కంపెనీ నుంచి బిల్లు​మొత్తం వచ్చే వరకు ఆగకుండా ఎంఎస్​ఎంఈలకు (చిన్న, మధ్యతరహా ఇండస్ట్రీలు) తమ సంస్థ​ ద్వారా అదే మొత్తానికి లోన్​ పొందవచ్చని ట్రేడ్​ రిసీవబుల్​ (టీఆర్ఈడీఎస్​) ప్లాట్​ఫారమ్ ఎం1 ఎక్స్ఛేంజ్​​ ప్రకటించింది. ఇది పూర్తిగా ఆన్​లైన్​ విధానంలో జరుగుతుందని, కాగితాలు, కొలేటరల్​ అవసరమే ఉండదని సంస్థ నేషనల్​ బిజినెస్​ హెడ్​ రాయ్​ మాథ్యూ కురియన్​ చెప్పారు. హైదరాబాద్​లో సోమవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘కంపెనీ నుంచి ఎంఎస్​ఎంఈలకు బిల్​ రావడానికి 45–90 రోజుల వరకు గడువు ఉంటుంది. మధ్యతరహా ఇండస్ట్రీలకు బిల్లింగ్​ సైకిల్​ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంఎస్​ఎంఈలు ఆర్థికంగా బలంగా ఉండవు కాబట్టి డబ్బు కోసం అంతకాలం వరకు ఆగడం కష్టం. ఈలోపు ఎం1 ఎక్స్ఛేంజ్ నుంచి ఇవి మా ప్లాట్​ఫారమ్​ సాయంతో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం ఇవి ఎం1లో రిజిస్టర్​ కావాలి. ఎంఎస్​ఎంఈలు బిల్స్​ను మా ఎక్స్ఛేంజ్​లో అప్​లోడ్​ చేయాలి. వాటిని బ్యాంకులు చూసి లోన్లను ఆఫర్​ చేస్తాయి.

అతి తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు నుంచి ఎంఎస్ఎంఈ 72 గంటలలోపే లోన్​ తీసుకోవచ్చు. బిల్లింగ్​ సైకిల్ ముగిసిన తరువాత కంపెనీయే (మెటీరియల్​ తీసుకున్నది) లోన్​ కడుతుంది. వడ్డీ మాత్రం ఎంఎస్​ఎంఈ భరిస్తుంది. మామూలుగా ఎంఎస్​ఎంఈలు బ్యాంకుల్లో లోన్​ తీసుకుంటే చాలా వడ్డీ కట్టాలి. మా ఫ్లాట్​ఫామ్​లో చాలా తక్కువ వడ్డీ ఉంటుంది. ఎం1 ఎక్స్ఛేంజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 26 లక్షల ఎంఎస్​ఎంఈలకు మేలు జరుగుతుంది. తెలంగాణ నుంచి 500, ఏపీ నుంచి 250 ఎంఎస్​ఎంఈలు మా కస్టమర్లు. 23 కంపెనీలు కూడా రిజిస్టర్​ అయ్యాయి. మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మా ద్వారా లోన్లు ఇస్తాయి. ఇప్పటి వరకు రూ.33 వేల కోట్ల బిజినెస్​ జరిగింది”అని రాయ్​ వివరించారు.