బీ అలర్ట్ : 7న హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

బీ అలర్ట్ : 7న హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారోత్సవం సందర్బంగా హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.  ఈ క్రింది ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. 

-ఏపీలో పెట్రోల్ పంప్ నుంచి వస్తున్న ట్రాఫిక్ ను బీజేఆర్ విగ్రహం వైపు నిషేధించారు ట్రాఫిక్ పోలీసులు. నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు ట్రాఫిక్ దారి మళ్లించనున్నారు. 

ఏపీలో పెట్రోల్ పంప్ నుంచి వస్తున్న ట్రాఫిక్ను బీజేఆర్ విగ్రహం వైపు నిషేధించారు ట్రాఫిక్ పోలీసులు. నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు ట్రాఫిక్ దారి మళ్లించనున్నారు. 

SBI గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ను బీజేఆర్  సర్కిల్ వైపు అనుమతించబడదు. చాపల్ రోడ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

బషీర్బాగ్  నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ ను నిషేధించారు. ఈ ట్రాఫిక్ను కింగ్కోటి , ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది. 

సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే ట్రాఫిక్ను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. 

అంతేకాకుండా పంజాగుట్ట, వీవీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం(మోనప్ప), నిరంకారి, పాత పీఎస్ సైఫా బాద్, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్, బషీరాబాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్ బీఐ గన్ ఫౌండ్రీ,  అబిడ్స్ సర్కిడ్, ఏఆర్ ఫీ పెట్రోల పంప్, నాంపల్లి, కేఎల్ కే బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్ గూడ జంక్షన్లతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. 

రవీంద్ర భారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్ నుంచి అంటే ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ముందు నుంచి ఏఆర్ పెట్రోల్ (పబ్లిక్ గార్డెన్) బంక్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లించాలి. 

పైన పేర్కొన్న మార్గాల్లో, సమయాల్లో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ తమ గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.