చెరువులో దూకేందుకు  మహిళ యత్నం..రక్షించిన సీఐ

చెరువులో దూకేందుకు  మహిళ యత్నం..రక్షించిన సీఐ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకేందుకు యత్నించిన ఓ వివాహిత, ఇద్దరు పిల్లలను ట్రాఫిక్ సిఐ శ్యాంసుందర్ రెడ్డి రక్షించారు. భర్తతో గొడవ పడి తన ఇద్దరు పిల్లలతో కలిసి  హిమాయత్ సాగర్ చెరువు వద్దకు చేరుకుంది. పిల్లలతో కలిసి చెరువులో దూకడానికి ప్రయత్నించిన మహిళను చూసిన పోలీసులు చెరువు వద్దకు పరుగులు తీసి ఆమెను అడ్డుకున్నారు. మహిళను, ఇద్దరు పిల్లలను బటయకు లాగేశారు. వారిని కాపాడి పోలీస్ వాహనం లోకి ఎక్కించి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. 

వివాహిత బండ్లగూడ జాగర కార్పొరేషన్  హైదర్ షా కోట్ ప్రాంతానికి చెందిన కుర్మమ్మ గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవ పడిన మహిళ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే హిమాయత్ సారగ్ చెరువు వద్దకు వెళ్లిందని చెప్పారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు.  మహిళ, ఇద్దరు పిల్లలను కాపాడిన ట్రాఫిక్ CI శ్యామ్ సుందర్ రెడ్డి,  సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.