
మెహిదీపట్నం, వెలుగు: ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో అక్టోబర్ నెలలో 1,114 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 162 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు.
14 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిందన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి కోర్టుకు హాజరుకాని వ్యక్తుల వెహికల్స్‌ను వేలానికి పంపుతామన్నారు.