నీట మునిగిన రోడ్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

నీట మునిగిన రోడ్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైదరాబాద్లో వర్షం దంచి కొట్టడంతో వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షపు నీటి కారణంగా ఎన్ఎండీసీ మాసబ్ ట్యాంక్ రోడ్లో ట్రాఫిక్ నెమ్మదించింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ రూట్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. చాదర్ ఘాట్, కోఠి మార్గంలోనూ టవాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. బషీర్ బాగ్ నుంచి కింగ్ కోఠి వెళ్లే రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అటు నాంపల్లి రోడ్డులోనూ మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. వనస్థలిపురంలో విజయవాడ నేషనల్ హైవేపై వరద నీరు చేరింది. వర్షపు నీటిలో రెండు కార్లు ఇరుక్కుపోయాయి. రోడ్లపై నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.