ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు ట్రాఫిక్ జామ్

ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు ట్రాఫిక్ జామ్

ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలతో టీఆర్ఎస్ లీడర్ల కార్లు రోడ్డు పైనే పెట్టేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు మరో రెండు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ భవన్ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా తెలంగాణభవన్ లోనే ఉండటంతో.. కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. 

మరోవైపు.. ఇప్పటికే జూబ్లీహిల్స్ రూట్ లో డైవర్షన్స్ తో జనం అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ పై పోలీసులు దృష్టి పెట్టడం లేదని వాహనదారులు విమర్శలు చేస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉన్నవారు వేరే రూట్లో వెళ్లడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.