హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం..

హైదరాబాద్ లో మళ్లీ  భారీ వర్షం..

హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట, పంజాగుట్ట,బంజారాహిల్స్, కూకట్ పల్లి,  బాలానగర్, జీడిమెట్ల, సూరారం, సుచిత్ర,  దిల్ సుఖ్ నగర్ ,కొత్తపేట,కర్మన్ ఘాట్, చంపాపేట, బోయిన్ పల్లి ,తిరులమల గిరి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.  పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరడంతో  ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు ప్రధాన మార్గాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిపై బోడుప్పల్ వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో  ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ- హైదరాబాద్ మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ కావడంతో  వాహనదారులు అవస్థ పడుతున్నారు.  తిరుమల గిరి,  అమీర్ పేట, బాలానగర్, కూకట్ పల్లి, చాదరఘట్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.