నగరంలో రెచ్చిపోతున్న ట్రాఫిక్ పోలీసులు

నగరంలో రెచ్చిపోతున్న ట్రాఫిక్ పోలీసులు

నగరంలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. వాహనాలపై చలాన్లు వాయించడమే కాదు, ఫైన్లు చెల్లించాలంటూ వాహనదారుల చెంపలు కూడా వాయిస్తున్నారు. రెండు రోజుల క్రితం మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్ వాహనదారున్ని పట్టుకుని ఎడాపెడా వాయించగా, తానేం తక్కువ తినలేదు అనుకున్నారో ఏమో కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ కూడా ఓ వాహనదారున్ని బండ బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. 

తాను పనిమీద అర్జంట్ గా బయటకు వచ్చానని డబ్బులు లేవు సార్ రేపు కడతానంటూ విజ్ఞప్తి చేసినా సదరు సీఐ దాడికి పాల్పడ్డారు. ఎందుకు కొడుతున్నారు సార్ అని వాహనదారుడు అడుగుతుంటే నా విధులకు ఆటంకం కలిగిస్తున్నావు అంటూ మరోసారి చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.