- హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
- బుధవారం ఒక్కరోజే వెయ్యి కేసులు
- పెండింగ్చలాన్లపైనా ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ముఖ్యంగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కేసులు పెట్టి, కోర్టుకు పంపుతున్నారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తున్న సుమారు వెయ్యి మందిపై కేసులు పెట్టారు.
వాహనాలనూ సీజ్ చేశారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, మెహిదీపట్నంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. మొదటిసారి పట్టుబడిన వారికి రూ.200 జరిమానా,రెండో సారి రూ.2 వేలు, మూడోసారి పట్టుబడితే జైలుకు పంపించే విధంగా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నారు.
ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో..
ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్ ఫొటోలతో పాటు ప్రాణాలకు ముప్పు వాటిల్లే అంశాలతో పిటీ కేసులను కోర్టుకు అందిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావల్సిందే. కోర్టు విధించే జరిమానాలు చెల్లించిన తరువాతనే వాహనాన్ని రిలీజ్ చేస్తుంటారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి వారం ర్యాండమ్‌గా స్పెషల్‌డ్రైవ్‌నిర్వహిస్తూ పెండింగ్‌చలాన్స్‌ను క్లియర్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హాట్‌స్పాట్స్‌ను గుర్తిస్తున్నారు.
పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయిస్తున్నారు
వాహనదారుల పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయించే విధంగా వెహికిల్ చెకింగ్ చేస్తున్నారు. ఇందుకు ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో ప్రతి రోజు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్‌లో చలాన్స్ డిస్కౌంట్ ఆఫర్ వినియోగించుకోని వాహనదారులు, మళ్లీ రిపీటెడ్‌గా రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని గుర్తించి పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయిస్తున్నారు.
గ్రీన్ సిగ్నల్ పడేలోగా చలాన్స్ చెకింగ్
ఎస్సై లేదా ఏఎస్సై స్థాయి అధికారి ఆధ్వర్యంలో వెహికిల్ చెకింగ్ చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్‌కు అనుగుణంగా వెహికిల్ చెకింగ్ చేస్తున్నారు. చలాన్స్ పెండింగ్‌ఉన్న వెహికిల్‌ను ట్రాఫిక్‌లో నుంచి పక్కకు తీసుకెళ్లి.. ఎలాంటి రూల్స్ బ్రేక్ చేశారు? ఎంత కాలంగా చలాన్స్‌పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఒక్క చలాన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆయా ఫైన్ అమౌంట్ క్లియర్ చేసేంత వరకు వెహికిల్‌ను తమ ఆధీనంలో పెట్టుకుంటున్నారు. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌పేమెంట్ చేయించి చలాన్స్ క్లియర్ చేస్తున్నారు.
ఫైన్స్ వేయడం మా ఉద్దేశం కాదు
రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి డ్రైవింగ్ వల్ల డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పే. రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఫైన్స్ వేయడం మా ఉద్దేశం కాదు. ఒక్క వాహనదారుడు రూల్స్ పాటించకపోయినా ఆ ప్రభావం మొత్తం ట్రాఫిక్‌పై పడుతుంది. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపితే బీఎన్‌ఎస్ 281,121 కింద కేసులు నమోదు చేస్తాం. బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేసిన సుమారు వెయ్యి మంది వాహనదారులపై కేసులు నమోదు చేశాం.
- విశ్వప్రసాద్,ట్రాఫిక్ చీఫ్,హైదరాబాద్
