ఎల్బీ స్టేడియంలో నేడు క్రిస్మస్ ఉత్సవాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయనున్నారు. అవసరమైనప్పుడు కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్దే నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు డైవర్ట్ చేస్తారు. బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వద్ద ఎస్‌బీఐ, ఆబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు. సుజాతా స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వెళ్లే వాహనాలను సుజాతా స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు.
