హైదరాబాద్, వెలుగు : పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, రోడ్డు నం.12 రూట్లో వచ్చే వెహికల్స్‌ను డైవర్ట్ చేస్తునట్లు జాయింట్ సీపీ, ట్రాఫిక్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో, ఫిలింనగర్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్‌నం.36, 45 మీదుగా మాదాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్‌నం.12 వైపు వెళ్లే వెహికల్స్ రోడ్‌నం.1, 10 జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్లాలి. ఫిలింనగర్ నుంచి ఒడిశా ఐస్ల్యాంగ్ వైపు వచ్చే వెహికల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ మీదుగా పంజాగుట్ట రూట్లో వెళ్లాల్సి ఉంటుందన్నారు.
