తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ( మే 10న) ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణం చేయనున్నారని లోక్ భవన్ ప్రకటించింది. అలాగే మే 13 లోపు బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చెన్నై సిటీలోని నెహ్రూ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రేపు విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక తనతోపాటు కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
గవర్నర్ అర్లేకర్ తో ఇవాళ(మే9) సాయంత్రం విజయ్ భేటీ అయ్యారు. తనకు మద్దతిచ్చే పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ నేతలతో గవర్నర్ ను కలిశారు . మద్దతు లేఖలతో పాటు ఆయా పార్టీలతో అధినేతలను తీసుకెళ్లారు విజయ్. గవర్నర్ తో 30 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు.
►ALSO READ | టీవీకే భేషరతుగా IUML సపోర్ట్.. 120కి చేరిన ఎమ్మెల్యేల మద్దతు
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని చేరుకోవడంలో విజయ్ టీవీకే పార్టీకి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. వీసీకే , IUML పార్టీలు విజయ్ TVKకి బేషరతు మద్దతు ప్రకటించడంతో ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది. తమిళనాడులో డీఎంకే , అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒకదానిని వదులుకోవడంతో TVK బలం 107కి చేరినప్పటికీ... ఇప్పుడు VCK, IUML పార్టీల చెరో రెండు సీట్ల మద్దతుతో విజయ్ బలం 120కి చేరుకుంది.
విజయ్ కు మద్దతిచ్చే పార్టీలు
టీవీకే పార్టీ: 107
కాంగ్రెస్ : 5
సీపీఎం: 2
సీపీఐ: 2
వీసీకే: 2
ఐయూఎంఎల్: 2
#UPDATE | The time for the oath ceremony of Tamil Nadu CM-designate Vijay has been changed to 10 am tomorrow, 10th May. https://t.co/hHRLN7ewWO pic.twitter.com/ABRKwP8k3T
— ANI (@ANI) May 9, 2026
