హైదరాబాద్ లో ఆగిపోయిన సీఎం చంద్రబాబు కాన్వాయ్... పది నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే...

హైదరాబాద్ లో ఆగిపోయిన సీఎం చంద్రబాబు కాన్వాయ్... పది నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే...

ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్ లో రోడ్డు మీద ఆగిపోయింది. శనివారం ( మే 9 ) బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో వెళ్తుండగా...ట్రాఫిక్ లో కొద్దిసేపు ఆగిపోయింది సీఎం చంద్రబాబు కాన్వాయ్. 

ఒకవైపు రోడ్లో ప్రధాని మోడీ సెక్యూరిటీ సిబ్బంది ట్రయల్ రన్ కొనసాగుతుండగా ట్రాఫిక్ లో ఆగిపోయింది చంద్రబాబు కాన్వాయ్.

సుమారు పది నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే మెల్లగా కదులుతూ వెళ్ళింది చంద్రబాబు కాన్వాయ్. సీఎం SSG సిబ్బంది కారు నుండి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంతో కాన్వాయ్ వెళ్ళిపోయింది.

►ALSO READ | తిరుపతి జనసేన పార్టీ సమావేశంలో రభస... చిత్తూరు, కడప నేతల మధ్య మాటల యుద్ధం..