RR vs GT: హాఫ్ సెంచరీలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు .. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

RR vs GT:  హాఫ్ సెంచరీలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు .. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కాస్త విఫలమయ్యారు. గుజరాత్ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారంటే ఎలా ఆడారో ఊహించవచ్చు. ఓపెనర్లు ఇచ్చిన పాట్నర్ షిప్ తో 4 వికెట్లు నష్టానికి రాజస్థాన్ ముందు 230 రన్స్ టార్గెట్ ఉంచింది గుజరాత్. 

గుజరాత్ ఓపెనర్లలో గిల్ 44 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్సులతో 84 రన్స్ తో విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకు ముందు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతులలో 6 సిక్సులు, 2 ఫోర్లతో 55 రన్స్ చేసి.. ఇద్దరి పాట్నర్షిప్ తో గుజరాత్ స్కో్ర్ పరుగులు తీసేలా కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 11వ ఓవర్ లో యశ్ రాజ్ పుంజా బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఎక్కువ సేపు నిలవలేక పోయాడు. 10 బాల్స్ ఆడి 13 రన్స్ తో జడేజా కు దొరికిపోయాడు. గిల్ తర్వాత వచ్చిన హోల్డర్ (7) అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు. 19వ ఓవర్ లో బ్రిజేశ్ శర్మ బౌలింగ్ లో జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి 

చివర్లో రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించడంతో గుజరాత్ కు మరింత స్కోర్ యాడ్ అయ్యింది. సుందర్ 21 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 37 రన్స్ చేయగా.. తెవాటియా 4 బంతులలో 2 సిక్సులతో 14 రన్స్ చేశాడు. 

రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకోగా,  రవీంద్ర జడేజా,  యశ్ రాజ్ పుంజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 19వ ఓవర్ వేసిన బ్రిజేష్ హోల్డర్ ను ఔట్ చేయడమే కాకుండా.. 3 డాట్ బాల్స్ వేసి కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు.