రేపు(ఆగస్టు15).. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు(ఆగస్టు15)..   హైదరాబాద్లో  ట్రాఫిక్ ఆంక్షలు

మెహిదీపట్నం,వెలుగు:  పంద్రాగస్టు వేడుకలకు కలర్​ఫుల్ లైట్లతో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. మంగళవారం గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఆదివారం ఆయన రిలీజ్ చేశారు. 

వీఐపీలు, పాసులున్న వారు వెహికల్స్ విండో స్కీన్ లకు ఎడమ వైపున వాటిని అతికించాలని, ఇన్విటేషన్ కార్డులో సూచించిన విధంగా ఇన్ టైమ్ కు హాజరై ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రూట్లు, ఎలైటింగ్ పాయింట్లు, పార్కింగ్ ఏరియాలను కేటాయించామన్నారు. గోల్కొండ ఏరియాలో ఉండే స్థానికుల ఇండ్ల ముందు, మెయిన్ రోడ్డుపై ఎలాంటి వెహికల్స్ ను పార్కింగ్ చేయొద్దన్నారు. వీఐపీలు, పాసులున్నవారు, వేడుకలను చూసేందుకు వచ్చే జనం గోల్కొండ కోటకు చేరుకోవడానికి ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేశామని.. దాన్ని పాటించాలని కోరారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నం. 9010203626 కు కాల్ చేయాలని సుధీర్ బాబు సూచించారు.

పాసులున్న వారు కోటకు చేరుకునే రూట్లు

  •     మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోట రూట్ ను క్లోజ్ చేయనున్నారు.
  •     ఉదయం 7 గంటల నుంచి 11 వరకు జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే గోల్డ్(ఎ), పింక్(ఎ), బ్లూ(బి) కలర్ పాసులున్న వారి వెహికల్స్ ను రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోటలోకి అనుమతిస్తారు. 
  •     సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, పింక్, బ్లూ కారు పాస్ లతో వచ్చే వెహికల్స్.. రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్, బాలికా భవన్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పుఖాన్ బ్రిడ్జి, రాందేవ్ గూడ జంక్షన్, మకై దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు చేరుకుని ఎడమవైపునకు వెళ్లాల్సి ఉంటుంది.
  • పార్కింగ్ ఏరియాలు   
  •     గోల్డ్ కలర్ ‘ఎ’ పాసులున్న వారు తమ వెహికల్స్​ను కోట మెయిన్ గేట్​కు ఎదురుగా ఉన్న ఫతే దర్వాజ రోడ్ వైపు పార్కింగ్ చేయాలి.
  •     పింక్ కలర్ ‘ఎ’ పాసులున్న వారు తమ వెహికల్స్ ను కోట మెయిన్ గేట్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్కింగ్ చేయాలి.
  •     బ్లూ కలర్ ‘బి’ పాసులున్న వారు గోల్కొండ బస్టాప్ నుంచి రైట్ టర్న్ తీసుకుని ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద వెహికల్స్ ను పార్కింగ్ చేయాలి.
  •     గ్రీన్ కలర్ ‘సి’ పాసులున్న వారు సెవెన్ టూంబ్స్, బంజారా దర్వాజా నుంచి ఒవైసీ గ్రౌండ్​లో వెహికల్స్ ను పార్క్ చేయాలి. అయితే, లంగర్ హౌస్ మీదుగా వచ్చే ‘సి’ పాసులున్న వారు ఫతే దర్వాజ మీదుగా బడా బజార్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి  గోల్కొండ కోట మెయిన్ గేట్ కు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒవైసీ, బల్దియా ప్లే గ్రౌండ్ వద్ద వారి వెహికల్స్​ను పార్ చేయాల్సి ఉంటుంది.
  •     రెడ్ కలర్ ‘డి’ పాసులున్న వారు షేక్ పేట నాలా, టొలిచౌకి, సెవెన్ టూంబ్స్, బంజారా దర్వాజ మీదుగా గోల్కొండకు చేరుకుని.. ప్రియదర్శిని స్కూల్​లో తమ వెహికల్స్ ను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
  •     బ్లాక్ కలర్ ‘ఇ’ పాసులున్న వారు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ కింద యూటర్న్ తీసుకుని ఫతే దర్వాజా వైపు వెళ్లి హుడా పార్కు వద్ద వెహికల్స్ ను పార్క్ చేయాలి.
  •     షేక్ పేట, టొలిచౌకి నుంచి వచ్చే సాధారణ వెహికల్స్ సెవెన్ టూంబ్స్ వద్ద పార్కింగ్ చేయొచ్చు. అక్కడి నుంచి వారు గోల్కొండ కోటకు చేరుకునేందుకు, వేడుకల అనంతరం తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులను ఎక్కాల్సి ఉంటుంది.
  •     వేడుకలు చూసేందుకు- గోల్కొండ కోటకు వచ్చే జనాలను గోల్ఫ్ క్లబ్, జమాలి దర్వాజ, బంజారా దర్వాజ మీదుగా దారి మళ్లిస్తారు.
  •     లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ కింద నుంచి వచ్చే వారిని బడా బజార్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు.
     

వేడుకలు ముగిసిన తర్వాత..

 

  •     పంద్రాగస్టు వేడుకలు ముగిసిన తర్వాత గోల్డ్, పింక్, బ్లూ పాసులున్న వెహికల్స్ మకై దర్వాజా, రాందేవ్ గూడ, లంగర్ హౌస్ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 
  •     గ్రీన్ కలర్ పాసులున్న వారు బడా బజార్, ఫతే దర్వాజ, బంజారా దర్వాజ, సెవెన్ టూంబ్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  •     రెడ్ కలర్ పాసులున్న వారు  బంజారా దర్వాజా, సెవెన్ టూంబ్స్ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. బ్లాక్ కలర్ పాసులున్న వారు సంబంధిత పార్కింగ్ ఏరియాల నుంచి వెళ్లొచ్చు.