
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం శంషాబాద్ చేరుకోనున్నారు. తర్వాత అక్కడి నుంచి శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. దీంతో శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ మీదుగా కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ అవతల NHకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఆరాంఘర్-శంషాబాద్ మార్గంలోకి వెళ్లొద్దన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌గాంధీ సభ జరగనుంది. ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.