మిలాద్- ఉన్నబీ భారీ ఊరేగింపు.. ఇయ్యాల (సెప్టెంబర్ 14) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్- ఉన్నబీ భారీ ఊరేగింపు.. ఇయ్యాల (సెప్టెంబర్ 14) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

బషీర్​బాగ్, వెలుగు: ముస్లింల పర్వదినమైన మిలాద్- ఉన్ -నబీని పురస్కరించుకొని సిటీలో నేడు భారీ ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

 ఊరేగింపు ముఖ్యంగా ఫలక్ నుమా నుంచి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు.. మహియా పాషా దర్గా నుంచి వోల్టా హోటల్ వరకు... మక్కా మజీద్ నుంచి నాంపల్లి హజ్ హౌస్ .. మక్కా మజీద్ నుంచి వోల్టా హోటల్.. పత్తార్ ఘాట్ నుంచి అలిజ కోట్ల వరకు జరగనుంది. 

ఈ క్రమంలో ఫలక్ నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్చింట ఎక్స్ రోడ్ , హిమ్మత్ పురా జంక్షన్, పత్తార్ ఘాట్, గుల్జార్ హౌస్, మదీనా జంక్షన్, ఢిల్లీ గేట్, బీడీ బజార్, ఉస్మాన్ గంజ్, వోల్టా హోటల్, ఏంజె మార్కెట్, నాంపల్లి టీ జంక్షన్, హజ్ హౌస్ తో పాటు పలు ప్రాంతాల్లో వాహనదారులను దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్గాలలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు.