గణేష్ ఉత్సవాలు..ఖైరతబాద్ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు

 గణేష్ ఉత్సవాలు..ఖైరతబాద్ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు

హైదరాబాద్లో  సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు భాగ్యనగరం వ్యాప్తంగా కన్నుల పండువుగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే మనకు గుర్తుకు వస్తాడు ఖైరతాబాద్ వినాయకుడు.  11 రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో నిత్యం రద్దీగా ఉంటాయి. దీంతో ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పా్ట్లు చేస్తున్నారు.

Also Rard: 26 వేళ్లతో జన్మించిన చిన్నారి.. దేవుని అవతారమంటున్న కుటుంబసభ్యులు

ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయి. 

ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్

  • రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్కు అనుమతి లేదు.  అటు వైపు వెళ్లే వాహనాలన్నీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
  • రాజ్ దూత్ లేన్ నుండి - గణేష్ టైపు రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. రాజ్ దూత్ లేస్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు ట్రాఫిక్ ని మళ్లిస్తారు.
  • మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతిలేదు.  అటుగా వెళ్లే వాహనాలు మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

వాహనదారులు టాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.