జీడిమెట్ల, వెలుగు: నగరంలోని బాచుపల్లి పీఎస్ పరిధిలో వేర్వేరు కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. మక్తల్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి కూతురు వర్ష(16) నిజాంపేట్శ్రీచైతన్య బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతూ అక్కడి హాస్టల్ లో ఉంటోంది. సోమవారం సాయంత్రం గంట పర్మిషన్అడిగి హాస్టల్గదికి వెళ్లింది. తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు వచ్చి డోర్కొట్టినా స్పందించకపోవడంతో సిబ్బందికి తెలిపారు.
తలుపు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించింది. హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సూసైడ్ కు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చదువులో ఒత్తిడి తట్టుకోలేకే వర్ష ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఏబీవీపీ క్యాంపస్లోపలకు చొచ్చుకువచ్చి బైఠాయించింది. దీంతో పోలీసులు సర్ధి చెప్పి పంపించారు.
ఎన్టీఆర్నగర్కు చెందిన స్టూడెంట్..
ఎన్టీఆర్నగర్కు చెందిన వెంకటేశం కొడుకు మంజునాథ్(18) బాచుపల్లిలోని ప్రగతి కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మంజునాథ్ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. ఈ రెండు కేసులను బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. .
