రైస్ మిల్ వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలి

రైస్ మిల్ వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న సాయికృప రైస్ మిల్లో విషాదం చోటుచేసుకుంది. మిల్లో పనిచేస్తున్న లింగంపల్లికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మలక్పేటలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనం ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. 

వర్క్ ప్రెషర్ తోనే శ్రీశైలం మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. కార్మికులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సదుపాయాలు సైతం కల్పించలేదన్నారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.