శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఓ కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొత్తం ఐదుగురూ చనిపోయారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు చనిపోయిన వారిని గుర్తించారు.
ఆగస్ట్ 20న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నట్లుగా సమాచారం. 3 రోజులుగా బయటకు రాకపోవడం దుర్వాసన రావడంతో పోలీసులకు సత్రం నిర్వాహకులు సమాచారం ఇచ్చారు.
తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించారు. చనిపోయిన ఐదుగురుని సుధాకర్(36),గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
