
ఇటీవల కాలంలో ఇండియన్ రైల్వే తప్పుడు నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు, రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపుతూ వీడియోలు అన్ లైన్ లో కుప్పలుకుప్పులు ప్రత్యక్షమవుతున్నాయి.
समस्तीपुर में वैशाली सुपरफास्ट एक्सप्रेस ट्रेन के गार्ड ने दिव्यांग के साथ की बदसलूकी, धक्का देकर ट्रेन से उतारा, वीडियो वायरल@spjdivn@RailwaySeva@RailMinIndia@AshwiniVaishnaw#Samastipur#samastipur_town pic.twitter.com/CwonYaSHSH
— Samastipur Town (@samastipurtown) August 14, 2024
రైల్వే ఉద్యోగులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, వివాదాలకారణంగా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ దివ్యాంగుడిపై రైలు గార్డ్ గళ్ల పట్టుకొని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వివరాల్లోకి వెళితే..
శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి పట్ల రైల్వే ఉద్యోగి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సహర్సా నుంచి న్యూఢిల్లీకి వెళ్లే వైశాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో మంగళవారం ఆగస్టు 12, 2024న సమస్తి పూర్ వద్ద ఈ ఘటన జరిగింది. దివ్యాంగుడైన వ్యక్తిపై రైల్ గార్డు దాడి చేయడం.. సమస్తిపూర్ రైల్వే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు అతన్ని కిందకు నెట్టడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది.
వ్యాంగుడిపై అరుస్తూ.. రైలు నుంచి దిగమని సూచించడం వీడియోలో కనిపిస్తుంది. వాగ్వాదం పెరగడంతో గార్డు దివ్యాంగుడి కాలర్ పట్టుకొని బూతులు తిట్టాడు. ఆ తర్వాత రైలులోంచి అతన్ని తోసేయడానికి ప్రయత్నించాడు.
ఈ ఘాతుకానికి పాల్పడిన రైల్ గార్డు రామ్ ఆశిష్ దాస్ గా గుర్తించారు. బాధితుడు రోస్టాలోని తథియా గ్రామానికి చెందిన వాడిగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైలు గార్డు తీరుపై మండిపడుతున్నారు. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అమానుషం.. రైల్ గార్డుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు.