ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లి అరెస్ట్..20 వరకు పోలీస్ కస్టడీ

ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లి అరెస్ట్..20 వరకు పోలీస్ కస్టడీ
  • 20 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్ట్

ముంబై: భూవివాదంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్  పూజా ఖేద్కర్ తల్లి మనోరమను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మనోరమను రాయగఢ్ జిల్లా మహద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నామని పుణె పోలీసులు గురువారం వెల్లడించారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. 

మనోరమను కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపిందని వివరించారు. ఇటీవల పుణె జిల్లా  ముల్సి గ్రామంలోని ఓ రైతును మనోరమ తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్  అయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో సోమవారం నుంచి ఆమె పరారీలో ఉన్నారు. అప్పటినుంచి పోలీసులు పుణెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం గాలించారు.