ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌‌ కృష్ణారెడ్డి విడుదల..షరతులతో కూడిన బెయిల్ 

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌‌ కృష్ణారెడ్డి విడుదల..షరతులతో కూడిన బెయిల్ 

హైదరాబాద్‌‌,వెలుగు: మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ను లైంగిక వేధించిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఉప్పరపల్లి కోర్టు మంగళవారం బెయిల్​ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని,  ప్రతి ఆదివారం అత్తాపూర్‌‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

సర్దార్ వల్లభాయ్‌‌ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ను లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఉదయ్​ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.   జూలై 29న నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో అతన్ని అరెస్ట్ చేశారు.  అప్పటి నుంచి 67 రోజులుగా చంచల్‌‌గూడ జైలు రిమాండ్‌‌ ఉన్నారు. కాగా, కస్టడీ పూర్తి కావడంతో పాటు రెండు నెలలకు పైగా జైలు రిమాండ్‌‌లో ఉన్నందున ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.