యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ పోస్టులు.. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వాళ్లకు మంచి ఛాన్స్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ పోస్టులు..  డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వాళ్లకు మంచి ఛాన్స్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మేనేజ్​మెంట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల సంఖ్య: 95.

పోస్టులు: మేనేజ్​మెంట్ ట్రైనీ 13, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ 20, డిప్లొమా ట్రైనీ 62. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బి.టెక్/ బీఈ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.

అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.ucil.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.