ఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు

ఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు జరగనున్నాయి. శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో  మంగళవారం వరకు ఈ తరగతులు నిర్వహించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న శిక్షణా శిబిరంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ , కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, వివేక్ వెంకటస్వామి, ఈటలతో పాటు.. పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 

దాదాపు 300 మందికిపైగా నేతలు శిక్షణా తరగతుల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారు. పార్టీ సిద్ధాంతాలపై నాయకులకు అవగాహన కల్పించనున్నారు. చివరి రోజైన మంగళవారం పార్టీ కార్యవర్గం సమావేశం కానుంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే అంశంపై కార్యాచరణ రూపొందించి తీర్మానం చేయనున్నారు.