ప్రయాణికులకు అలెర్ట్...ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలెర్ట్...ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణించే కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో  మెయింటటెన్స్ పనుల కారణంగా  జులై 24 నుంచి 30వ తేదీ వరకు ప‌లు రైళ్లను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మ‌రికొన్ని రైళ్లను పాక్షికంగా ర‌ద్దు చేయడంతో పాటు.. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. 


రద్దైన రైళ్లు ఇవే..

కాచిగూడ – నిజామాబాద్ (07596)
నిజామాబాద్ – కాచిగూడ (07593)
నాందేడ్ – నిజామాబాద్ (07854)
నిజామాబాద్ – నాందేడ్ (07853)

పాక్షికంగా ర‌ద్దైన రైళ్లు ఇవే..

దండి నుంచి నిజామాబాద్ (11409)  వెళ్లే రైలు జులై 23 నుంచి 30వ తేదీ వ‌ర‌కు  ముద్ఖేడ్ – నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దయింది. నిజామాద్ నుంచి పంధ‌ర్‌పూర్‌(01413) వెళ్లే రైలును జులై 24 నుంచి 31 వ‌ర‌కు నిజామాబాద్ – ముద్ఖేడ్ మ‌ధ్య పాక్షికంగా ర‌ద్దు  చేశారు. 

రీ షెడ్యూల్  రైళ్లు ఇవే..

క‌ర్నూల్ సిటీ – సికింద్రాబాద్ (17024) రైలు జులై 25న 90 నిమిషాలు ఆల‌స్యంగా న‌డ‌వ‌నుంది. గుంత‌క‌ల్ – బోధ‌న్(07671) రైలు  జులై 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు ఆల‌స్యంగా న‌డ‌వ‌నుంది. 

అలాగే చీకటిగలపాలెం -శావల్యాపురం మధ్య నాన్ ఇంటర్ లాంకింగ్ పనులు జరుగుతున్న క్రమంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) ట్రైన్‌ మార్కాపురం నుండి తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు.