
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్ కో డిపార్ట్ మెంట్ లో ఏఈలకు ఏడీలుగా పదోన్నతులు ఇవ్వడంతో ఇంజనీర్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కృతజ్ఙతలు తెలిపారు.
ఈ ప్రమోషన్లు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చాయని చెప్పారు. అలాగే జెన్కో, డిస్కమ్‌లలో అర్హత కలిగిన ఇంజనీర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని వారు అభ్యర్థించారు. ప్రతినిధుల వినతులపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.