నిరంతర కరెంట్ అందిస్తాం : ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ 

నిరంతర కరెంట్ అందిస్తాం : ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ 

లింగంపేట, వెలుగు : కరెంట్​కోతలు లేకుండా నిరంతర కరెంట్​సరఫరా చేస్తామని జిల్లా ట్రాన్స్​కో ఎస్​ఈ రవీందర్​ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని బానాపూర్​గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. సబ్​స్టేషన్​ఎదుట ఎందుకు ధర్నా చేశారని, సమస్యలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. బానాపూర్ సబ్​స్టేషన్ నుంచి బోనాల్ ఫీడర్​కు విద్యుత్​ సరఫరా చేయడం వల్ల త్రీఫేజ్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని  రైతులు ​చెప్పారు.

ఎస్​ఈ స్పందించి బోనాల్​ ఫీడర్​కు విద్యుత్ సరఫరాను నిలిపివేసి లింగంపేట సబ్ స్టేషన్​ నుంచి బోనాల్​ ఫీడర్​కు  కరెంట్ సరఫరా చేయాలని సిబ్బం దికి సూచించారు. ఇక నుంచి అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఆయన వెంట ఎల్లారెడ్డి డీఈఈ విజయ సారథి,ఏడీఏ చీకోటి మల్లేశం,ఏఈ హరీష్​రావు,సిబ్బంది ఉన్నారు