తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీ..

రాష్ట్రంలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 31 రాత్రి తహసీల్దార్లను  బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాన్స్ ఫర్స్ చేస్తుండగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)  ఆదేశాలు చేసింది. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ని  రెండు మల్టీజోన్ల పరిధిలో ఈ బదిలీలు చేపట్టింది.రంగారెడ్డి జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న తహసీల్దార్లను కూడా బదిలీ చేశారు.  ఇక్కడ పనిచేస్తున్న 20 మందిని ఇతర జిల్లాలకు, వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న 21 మందిని రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు.  

ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే బదిలీల్లో జిల్లా నుండి వెళ్లాల్సిన వారిని పంపించడం, వచ్చే వారికి చేర్చుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.