హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్జెండర్లు సోమవారం బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తమకు వివిధ ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన విజయలక్ష్మి ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిశీలించి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
